Kangana Ranaut : కంగ‌నా కారుని అడ్డ‌గించి దాడి చేసే ప్ర‌య‌త్నం.. !

Kangana Ranout : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ కొద్ది రోజులుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ కొంద‌రు ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణం అవుతుంది. ఇటీవ‌ల రైతుల‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసింది కంగనా. ఈ క్ర‌మంలో ఆమెపై దాడులు చేసే ప్ర‌య‌త్నం చేశారు. పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో ఆమె కారును పెద్ద ఎత్తున రైతు నిరసనకారులు అడ్డగించారు. రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

kangana ranaut attacked by farmers
kangana ranaut attacked by farmers

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకరంగా నిరసన తెలిపిన రైతులను ఉగ్రవాదులు, ఖలిస్తానీలతో పోల్చుతూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను ‘జిహాదిస్ట్ నేషన్’ అని పిలిచారు. సిక్కులను ‘ఖలిస్థానీలు’గా కంగనా పిలిచారు.

kangana ranaut attacked by farmers
kangana ranaut attacked by farmers

ఈ క్ర‌మంలో కంగనా ప్రయాణిస్తున్న కారును రైతులు జెండాలతో నినాదాలు చేస్తూ అడ్డగించారు. ‘నన్ను రైతు నిరసనకారులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. దూషిస్తూ.. నన్ను చంపుతామని బెదిరించారు’ అని ఆమె కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రైతు నిరసనకారులు గుంపుగా చుట్టూ చేరేసరికి ఏం చేయాలో తోచలేదని తెలిపారు.

సెక్యూరిటీ సిబ్బంది కూడా తనతో లేరని, తాను రాజకీయ నాయకురాలిని కాదని చెప్పారు. రైతు నిరసనకారులు తనను అడ్డిగించడాన్ని కంగనా తీవ్రంగా ఖండించారు. కేంద్రం రైతుల కోసం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కంగ‌నా త‌న‌కు జ‌రిగిన ఘ‌ట‌న‌పై స్పందిస్తూ… నేను పంజాబ్‌లోకి ప్రవేశించిన వెంటనే.. ఓ మూక నా వాహనంపై దాడి చేసింది. మేం రైతులమని వాళ్లు చెప్పారు. ఒకవేళ అక్కడ పోలీసులు లేకపోతే నాపై మూక దాడి జరుగుండేది. నా విమానం క్యాన్సిల్ కావడంతో హిమాచల్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాను. నన్ను చంపేస్తామని బెదిరించారు అని చెప్పుకొచ్చింది.