SITA: సీత టైటిల్‌తో విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిత్రం.. ప్ర‌ధాన పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారంటే..!

SITA: బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా రైటర్‌గా మారిన విజయేంద్ర ప్రసాద్ కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించారు. ఇక ఇప్పుడు సీత అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతుండ‌గా, దానికి కూడా విజయేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు.గ‌త కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.

SITA

సీత పాత్ర‌లో క‌రీనా క‌పూర్ న‌టించ‌నుంద‌ని, దానికి ఆమె భారీ రెమ్యురేష‌న్ కూడా డిమాండ్ చేసింద‌ని అన్నారు. కాని ఆ పుకార్ల‌న్ని కొట్టి పారేస్తూ సీత సినిమా కోసం కంగ‌నా ర‌నౌత్‌ని ఎంపిక చేసిన‌ట్టు మేక‌ర్స్ తెలియ‌జేశారు. అలౌకిక్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా పోస్ట‌ర్ విడుద‌ల చేసి పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

రీసెంట్‌గా కంగ‌నా .. జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన త‌లైవా సినిమాలో న‌టించి మెప్పించింది. టైటిల్ పాత్ర కోసం కంగనా రనౌత్‌ని అనుకున్నాం అని చెప్పగానే చాలామంది బ్యాడ్‌ చాయిస్‌ అన్నారు. ఇదే విషయాన్ని ప్రకటించిన సమయంలో సోషల్‌ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టారు. కానీ, సినిమా చూశాక తమ అభిప్రాయం మారింది. కంగ‌నా చాలా చ‌క్క‌గా పాత్ర‌లో ఒదిగిపోయింద‌ని నిర్మాత అన్నారు.

SITA

మైథ‌లాజికల్ మూవీగా రూపొంద‌నున్న సీత చిత్రాన్ని తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రం కంగ‌నాని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్ల‌నుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఇదిలా ఉంటే కంగ‌నా తేజాస్ అనే సినిమాతో పాటు ఇత‌ర చిత్రాల‌తో బిజీగా ఉంది.