KANGANA RANAUT: ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పిస్తున్న హీరోయిన్ ఇల్లు.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

సినీ, క్రీడా ,రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ ఇంటిని ఎంత అందంగా మ‌ల‌చుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ఇళ్ల‌ని చూస్తుంటే మ‌న‌కు ఇంద్ర‌భ‌వ‌నం చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఇంటిని తీర్చిదిద్దుకుంటుండ‌గా, ఇందులో స‌క‌ల‌స‌దుపాయాలు ఉంటాయి. లివింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, బుక్ రీడింగ్ రూమ్ , బార్ రూమ్ ఇలా సినిమాలో చూపించిన‌ట్టే వారి ఇళ్లు ఉంటాయి. అప్పుడ‌ప్పుడు కొంద‌రు సెల‌బ్రిటీల ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా వాటిని చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతుంటారు.

తాజాగా బోల్డ్ బ్యూటీ కంగనా ర‌నౌత్ ఇంటికి సంబంధించి ఫొటోలు బ‌య‌ట‌కు రాగా, వీటిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మంచు కొండ‌ల ప్రాంతంలో కంగ‌నా ర‌నౌత్ 30 కోట్లు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ఈ ఇంటిని నిర్మించుకుంది. 2017లో ఇంటీరియర్‌ డిజైనర్‌ శబ్నం గుప్తా కంగనా ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ప‌నులు మొద‌లు పెట్ట‌గా, 2018లో పూర్తైంది. అదే సంవ‌త్స‌రంలోనే కంగాన ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇందులో 7 బెడ్‌రూంలు, 7 బాత్రూమ్‌లతో పాటు విశాలమైన హాల్ ఉంటుంది. ఇంటి అద్దాల నుండి చూస్తే ప్ర‌కృతి క‌నిపించే విధంగా ఈ ఇల్లుని డిజైన్ చేయించుకుంది.

హిమాలయాలను మంచు కప్పినట్లుగా ఈ బెడ్‌రూమ్‌లో తెలుపు రంగు డామినేషన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో లివింగ్ రూం, బార్ రూం , స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. కంగ‌నా త‌న స్వ‌హ‌స్తాల‌తో వేసిన పెయింటింగ్స్ కూడా మ‌న‌కు ఈ ఇంట్లో క‌నిపిస్తాయి. స్వ‌ర్గ సీమ‌లా కంగ‌నా ఇల్లు ఉండ‌నుండ‌గా, ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక కంగ‌నా విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీగా మారిన కంగనా త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో త‌లైవి అనే సినిమా చేస్తుంది. ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది కంగ‌నా. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ, కరోనా వ‌ల‌న వాయిదా ప‌డింది.

Advertisement