KANGANA: కంగ‌నాకు షాకిచ్చిన ట్విట్ట‌ర్‌..ఇది ప్ర‌జాస్వామ్యాన్ని పాతిపెట్ట‌డ‌మేనంటూ ట్వీట్‌

ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌కు ట్విట్ట‌ర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆమె అకౌంట్‌ను పూర్తిగా స‌స్పెండ్ చేసింది. నిత్యం అభ్యంత‌ర‌క‌ర ట్వీట్స్ చేస్తున్న కార‌ణంగానే ఆమె అకౌంట్ ర‌ద్దు చేసిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా స‌మ‌యం నుండి కంగ‌నా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతుంది. ముఖ్యంగా బీజేపీకి స‌పోర్ట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తుంది. ప‌శ్చిమ బెంగాల్‌లో ఫ‌లితాల త‌ర్వాత తీవ్ర‌స్థాయిలో హింస జ‌రుగుతుందంటూ ప‌లు వీడియోలను షేర్ చేసింది.అక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కూడా ఆదేశించింది.

పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని, బెంగాల్ మంట‌ల్లో కాలిపోతుంద‌ని కంగ‌నా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. దీంతో ట్విట్టర్ యాజ‌మాన్యం ఆమె ఖాతాను స‌స్పెండ్ చేసింది. అయితే ఇలా చేయ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేసిన కంగ‌నా, ఇది ప్ర‌జ‌స్వామ్యాన్ని నిలువునా పాతిపెట్ట‌డ‌మేన‌ని విమ‌ర్శించింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో కంగ‌నా చేసే కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ నెటిజ‌న్స్‌కు కూడా ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. కాగా, కంగనా చివ‌రిగా త‌లైవా అనే చిత్రంలో న‌టించ‌గా ఈ చిత్రం క‌రోనా వల‌న వాయిదా ప‌డింది. ధాకడ్‌, తేజస్‌ సినిమాల్లోను న‌టిస్తోంది

 

Advertisement