Priyanka Chopra: ప్రియాంక విడాకులు తీసుకోబోతుందంటూ క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Priyanka Chopra: ఈ మ‌ధ్య కాలంలో విడాకులు ప్ర‌తి ఒక్క‌రికి కామ‌న్‌గా మారాయి. చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తే వెంట‌నే విడాకులు అంటున్నారు. ఇక సెల‌బ్రిటీల సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారి ప్రేమ‌, పెళ్లి, డైవ‌ర్స్ ఎప్పుడు జ‌రుగుతాయో కూడా ఎవ‌రం చెప్ప‌లేం. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమలోనూ విడాకులు తీసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది.

Kamal R Khan Comments on Priyanka Chopra
Kamal R Khan Comments on Priyanka Chopra

బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే చాలా మంది విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, మలైకా అరోరా, అమీర్ ఖాన్ ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు ప‌లు కార‌ణాల వ‌ల‌న చేసుకున్న వారికి విడాకులు ఇచ్చారు. రీసెంట్‌గా అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చి 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లికాడు.వీరి విడాకుల అంశంపై బాలీవుడ్ తారలు సైతం తమదైన స్టైల్లో స్పందించిన సంగతి తెలిసిందే.

అమీర్ ఖాన్ విడాకులపై బాలీవుడ్ న‌టుడు, సినీ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. త‌న భార్య క‌ళ్ల‌జోడు మొహం బోర్ కొట్టి విడాకులు ఇచ్చి ఉంటాడని అన్నారు. తాజాగా ప్రియాంక చోప్రా విష‌యంలో క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. “ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు కేఆర్‏కే. అం

తేకాదు.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‏ల సంతానానికి సరైన పేరు పెట్టనందున వాళ్లు భవిష్యత్తులో మంచి నటులుగా రాణించలేరని జోస్యం చెప్పాడు. బాలీవుడ్‏లో ఓ నటుడికి అతడి తండ్రి మరణించాకే సరైన గుర్తింపు దక్కుతుందని తెలిపాడు. అయితే ఆ నటుడెవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కొంద‌రు నెటిజ‌న్స్ ఆయ‌న‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.

మంచి మాట్లాడ‌క‌పోయిన ప‌ర్లేదు కాని చెడు మాట‌లు మాట్లాడి అంద‌రితో త‌న్నులు తిన‌కు అంటూ పలువురు సూచ‌న‌లు చేస్తున్నారు. స్టార్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోతేనే మంచిదని సూచిస్తున్నారు. ప్రిడిక్షన్ అంటూ చెత్త రాత‌లు రాసి అభిమానుల ఆగ్ర‌హానికి గురి కావొద్దు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.