BIGG BOSSS : బిగ్ బాస్ నుండి స్టార్ హీరో ఔట్.. కొత్త హోస్ట్ ఎవ‌రో మ‌రి..!

BIGG BOSSS : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. నార్త్‌లో ఈ షోకు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో సౌత్‌లోని ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లో బిగ్ బాస్ షోను రూపొందించారు. తెలుగు, త‌మిళంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజ‌న్‌కు సిద్ధ‌మైంది. తెలుగులో ఐదో సీజ‌న్‌ను నాగార్జున హోస్ట్ చేస్తార‌ని పక్కా క్లారిటీ ఉండ‌గా, త‌మిళంలో మాత్రం క‌మ‌ల్ స్థానంలో మ‌రొక‌రు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

BIGG BOSSS
BIGG BOSSS

బిగ్ బాస్ త‌మిళం తొలి సీజ‌న్ నుండి క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా ఉన్నారు. స‌క్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజ‌న్స్‌కు హోస్ట్‌గా ఉన్న క‌మ‌ల్ ఐదో సీజ‌న్‌ను హోస్ట్ చేస్తార‌ని అంద‌రు భావించారు. కాని ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినిమాల‌తో బిజీగా ఉన్న లోక‌నాయ‌కుడు ఈ సీజ‌న్‌కు దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. రానున్న ఎల‌క్షన్స్ కోసం జోరుగా ప్ర‌చారాలు చేస్తున్న క‌మ‌ల్ హాసన్ మ‌రోవైపు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో క‌మ‌ల్‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌డం లేదు. అయితే క‌మ‌ల్ స్థానంలో హీరో శింబు బిగ్ బాస్ సీజ‌న్ 5ని హోస్ట్ చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై మ‌రి కొద్ది రోజుల‌లో క్లారిటీ రానుంది.

Advertisement