Kamal Hassan : క‌మ‌ల్‌కి కరోనా.. బిగ్ బాస్ హోస్ట్‌గా శృతి హాస‌న్

Kamal Hassan : లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.ఇటీవల తన సొంత క్లాత్‌ బ్రాండ్‌కు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికా వెళ్లిన కమల్‌.. తాజాగా తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే లక్షణాలు కనిపించగానే వెంటనే అలర్ట్‌ అయిన కమల్‌.. పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Kamal Hassan tested corona positive
Kamal Hassan tested corona positive

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అభిమానులు , పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎంఎన్ఎం పార్టీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితిపై కమల్‌ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అమెరికా టూర్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాస్త దగ్గు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

Kamal Hassan tested corona positive
Kamal Hassan tested corona positive

ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ప్రస్తుతం.. భారతీయుడు సీక్వెల్ చిత్రంతో పాటు ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Kamal Hassan tested corona positive
Kamal Hassan tested corona positive

మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 5కి హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్‌కి క‌రోనా సోక‌డంతో ఈ షోకి ఎవ‌రు హోస్ట్‌గా ఉంటారు అనే దాన‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న కూతురు శృతి హాస‌న్‌తో బిగ్ బాస్ షోని కొద్ది రోజుల పాటు నడిపించ‌నున్నార‌ని టాక్.

గ‌తంలో నాగార్జున గైర్హాజ‌రు అయిన‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ‌, స‌మంత బిగ్ బాస్ షోని హోస్ట్ చేశారు. ఇప్పుడు అలానే క‌మ‌ల్ కి బ‌దులు శృథి హాస‌న్ షోని న‌డిపించ‌నుంద‌ని స‌మాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.