Kamal hasan: క‌మ‌ల్ హాస‌న్‌కి క‌రోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్

Kamal hasan: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ని భ‌య‌పెడుతుంది. ఇప్పుడు క‌రోనా కాస్త శాంతించిన‌ట్టు క‌నిపిస్తుండ‌గా, కొంద‌రిని మాత్రం ఇబ్బందుల‌కి గురి చేస్తుంది. తాజాగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌కి క‌రోనా పాజిటివ్ అని నిర్ధాణ అయిన‌ట్టు తెలుస్తుంది. క‌మ‌ల్‌కి షూటింగ్ స‌మ‌యంలో త‌గిలిందా, వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అంటుకుందా వంటి విష‌యాలు తెలియాల్సి ఉంది.

kamal hasan corona postive2
kamal hasan corona postive2

క‌మ‌ల్‌కి క‌రోనా అనే స‌రికి అంద‌రు ఉలిక్కిప‌డుతున్నారు. త్వ‌ర‌ల‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఇప్పటికీ ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. వరుస చిత్రాలతో యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు. తన సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మిచేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుతం కమల్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. పలు కారణాల వలన వాయిదా పడిన ఈ సినిమా వచ్చే నెల నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా కమల్ ఇద్దరూ స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. తమిళ్ స్టార్స్ విక్రమ్.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో భారీ మల్టీస్టారర్ నిర్మించనున్నారట. ఈ సినిమాను ఓ ప్రముఖ దర్శకుడు తెరెకెక్కించబోతున్నారట. ఇందులో కమల్ కూడా నటించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతుందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట. ఇక ప్రస్తుతం కమల్ నటిస్తున్న విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమాలకు సంబంధం లేని ఒక వ్యాపారంలోకి కమల్ అడుగుపెట్టారు. ఖద్దర్‌ దుస్తులకు మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఖద్దర్‌ను ఎక్కువగా ఎవరూ పట్టించుకోకపోయినా.. ఈ మధ్య ప్రభుత్వ ప్రోత్సాహంతో ఖద్దర్‌కు గుర్తింపు లభిస్తోంది.

kamal hasan corona postive1
kamal hasan corona postive1

అయితే ఈ ఖద్దర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతో కమల్ హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘కేహెచ్‌ హౌజ్‌ ఆఫ్‌ ఖద్దర్‌’ పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ అయ్యింది.