Vikram: ‘విక్రమ్’ నయా సంచలనం: 400 కోట్ల క్లబ్బులోకి కమల్ సినిమా.!
NQ Staff - June 27, 2022 / 11:23 AM IST

Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా వసూళ్ళ రికార్డులు కొనసాగుతూనే వున్నాయి. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ హాసన్ కెరీర్‌లో సాధించిన విజయాలెన్నో. సృష్టించిన రికార్డులు ఇంకెన్నో. అందుకే, ఆయన విశ్వ నటుడయ్యాడు.

Kamal Haasan’s “Vikram” film enters Rs 400-crore club
కానీ, ఈసారి అంతకు మించి.. ఔను, దాదాపు పదేళ్ళ తర్వాత నిఖార్సయిన కమర్షియల్ హిట్టు కొట్టాడు కమల్ హాసన్. అలా ఇలా కాదు, బాక్సాఫీస్ మైండ్ బ్లాంక్ అయిపోయేలా. తెలుగు, తమిళం సహా అనేక భాషల్లో ‘విక్రమ్’ సంచలనాలు కొనసాగుతున్నాయి.
400 కోట్ల క్లబ్బులో చేరిన ‘విక్రమ్’.!
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో 400 కోట్ల క్లబ్బులోకి చేరాడు. తాజాగా, ఈ సినిమా వసూళ్ళు 400 కోట్ల మార్క్ దాటడంతో కమల్ అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. త్వరలోనే 500 కోట్ల రూపాయల వసూళ్ళ మైలు రాయినీ ‘విక్రమ్’ చేరుకుంటుందని కమల్ అభిమానులు అంటున్నారుగానీ, అదంత తేలికైన విషయం కాదు.
కాగా, ‘విక్రమ్’ థియేటర్లలో హంగామా కొనసాగుతున్న నేపథ్యంలో, సినిమాని ఓటీటీలో విడుదల చేసే విషయమై నిర్మాతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని చిత్ర నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు.
కాగా, తమిళంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఇప్పటికే ‘విక్రమ్’ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.