Kamal Haasan: లోకేష్‌కి క‌మ‌ల్ హాసన్ ప్రామిస్.. ఏంటో తెలుసా?

NQ Staff - June 18, 2022 / 10:54 AM IST

Kamal Haasan: లోకేష్‌కి క‌మ‌ల్ హాసన్ ప్రామిస్.. ఏంటో తెలుసా?

Kamal Haasan: వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న క‌మ‌ల్ హాస‌న్‌కి విక్ర‌మ్ రూపంలో బ‌డా హిట్ అందించాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. కోటి విలువైన లెక్సస్ సెడాన్ కారును బహుమతిగా ఇచ్చారు క‌మ‌ల్.

ఫుల్ సపోర్ట్..

రాజ్‌ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాని చిత్ర డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. పైగా లోకేష్ కమల్ పాత్రను తీర్చిదిద్దిన విధానం అభిమానులకు కన్నుల విందు చేసింది. కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని చూసి అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు.

Kamal Haasan's Promise for Lokesh Kanagaraj

Kamal Haasan’s Promise for Lokesh Kanagaraj

లోకేష్ ఇచ్చిన ఈ చిత్రంతో నిర్మాణం వహించిన కమల్ భారీ లాభాలను కూడా చూసారు. దీనితో ఈ విజయం పట్ల ఎంతో ఎమోషనల్ అయ్యిన కమల్ దర్శకుడు లోకేష్ కి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రామిస్ ఇంతకు ముందే ఇచ్చారు. లోకేష్ తనతో సినిమాలు చేయకపోయినా కూడా తన సపోర్ట్ ఏ రకంగా కావాలన్నా ఉంటుంది అని తెలిపారు. లేటెస్ట్ గా కూడా లోకేష్ నెక్స్ట్ విజయ్ తో చేసే సినిమాకి కూడా ఏమన్నా సహకారం కావాలి అంటే అందిస్తానని తాను తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

లోకేష్ కనగారాజ్ విషయానికొస్తే.. తమిళంలో పాటు తెలుగులో వరుసగా కార్తి ‘ఖైదీ మూవీతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత విజయ్ హీరోగా తెరెక్కించిన ‘మాస్టర్’ మూవీతో కెవ్వు కేక పెట్టించారు. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్‌‌తో విక్రమ్ సినిమాతో హాట్రిక్ సక్సెస్ అందుకొని దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత స్థానం అందుకున్నారు.

విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో న‌టించ‌గా, తమిళ హీరో సూర్య గెస్ట్‌ రోల్‌లో అదగొట్టేసారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ మాజీ ‘రా’ ఏజెంట్‌గా అదరగొట్టారు. భారీ అంచనాల మధ్య జూన్ 3న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us