Kamal Haasan: 65 ఏళ్ల వయసులోనూ అదే స్పీడు.. నీ జోరుకు సలాం

Kamal Haasan: కొంతమంది హీరోలకు వయసుతో అస్సలు సంబంధం ఉండదు. వాళ్లకు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. రజినీకాంత్, చిరంజీవి అలాంటి కోవలోకే వస్తారు. కమల్ హాసన్ కూడా అంతే. ఈయన వయసు 65 ఏళ్లు. కానీ నేను చేసే పనులు చూస్తే మాత్రం అలా అనిపించదు. ఈ వయసులో కూడా యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడు కమల్ హాసన్.

kamal Haasan

పైగా డూప్ లేకుండా చేసేస్తాను అంటూ ముందుకు దూసుకొస్తారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వస్తుందా లేదా అనేది ఎవరికీ తెలియదు. దర్శకుడు నిర్మాతల మధ్య జరుగుతున్న రగడ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత భారతీయుడు 2 మళ్ళీ పట్టాలెక్కనుంది. దాంతో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాకు కమిట్ అయ్యాడు కమల్ హాసన్.

kamal Haasan

ఈ సినిమాకు గతేడాది ఓకే చెప్పాడు లోక నాయకుడు. అయితే ఎన్నికల హడావిడిలో ఉండడంతో సినిమా ప్రకటించిన ఆరు నెలల తర్వాత కానీ సెట్స్ పైకి రాలేదు. ఈ మధ్య రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న కమల్ విక్రమ్ సినిమా త్వరత్వరగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. విక్రమ్ సినిమా కోసం కేజిఎఫ్ సినిమాకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ అంబు, అరవి బ్రదర్స్ వర్క్ చేయనున్నారు.

Kamal Haasanవిక్రమ్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయి. కమల్ హాసన్ వీటి కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నాడు కూడా. వయసు కూడా పట్టించుకోకుండా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చేయబోతున్నాడు లోకనాయకుడు.

ఈయన వయసుని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. రవితేజ ఖిలాడి సినిమాకు కూడా అంబు అరవి యాక్షన్ సీక్వెన్స్ లు సమకూరుస్తున్నారు.