Biggboss Ultimate: బిగ్ బాస్ షో నుండి తప్పుకున్నకమల్ హాసన్.. కారణాలేంటో తెలుసా?
NQ Staff - February 21, 2022 / 12:09 PM IST

Biggboss Ultimate: లోకనాయకుడు కమల్ హాసన్ వెండితెరపై విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకి మంచి వినోదం పంచాడు. ఆయన బిగ్ బాస్ షో బుల్లితెరకు కూడా ఎంట్రీ ఇచ్చాడు.తొలి సీజన్ నుండి కమల్ హాసన్ బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్. తన రాబోయే చిత్రం విక్రమ్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు కమల్ హాసన్.

Kamal Haasan hits Good Bye to Biggboss Ultimate
లాక్‌డౌన్ పరిమితుల కారణంగా “విక్రమ్” సినిమా కోసం నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయవలసి వచ్చింది. అనివార్య పరిస్థితుల్లో బిగ్ బాస్ కోసం కేటాయించాల్సిన డేట్స్ విక్రమ్ సినిమా కోసం కేటాయించాల్సి వస్తోంది. కొంతమంది స్టార్స్, టెక్నికల్ పర్సన్స్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు విక్రమ్ షూటింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది.

Kamal Haasan hits Good Bye to Biggboss Ultimate
ఇటువంటి సమయంలో బిగ్ బాస్, విక్రమ్ షూటింగ్ రెండింటినీ కలిపి నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోంది. స్టార్ యాక్టర్స్, టెక్నికల్ పర్సన్స్‌ని నా కోసం వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందువల్లే బిగ్‌బాస్ ఈ సీజన్ నుండి వైదొలగవలసి వచ్చింది అని కమల్ హాసన్ చెప్పారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న ‘విక్రమ్’ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ‘బిగ్‌బాస్’ లో కమల్‌హాసన్ ప్లేన్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనే విషయంపై కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కమల్‌కు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ‘బిగ్‌బాస్’ షోకి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు.
తమిళంలో ఆల్రెడీ ఓటీటీలో వస్తోంది. బిగ్ బాస్ అల్టిమేట్ అంటూ ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ షోకు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూనే వస్తున్నాడు. కానీ ఫిబ్రవరి 20 తరువాత ప్రసారం కానున్న ఎపిసోడ్‌లకు తాను హోస్ట్‌గా ఉండబోవడం లేదని కమల్ హాసన్ వివరించాడు. దీనికోసం ఓ సుదీర్ఘ లేఖను రాశాడు. బిగ్ బాస్ సీజన్ 6కి మాత్రం తాను హోస్ట్‌గా ఉండనున్నాడు