Kamal Haasan: దశావతారంకి 13 ఏళ్ళు .. ఈ సినిమాకి పునాది ఎలా ప‌డిందంటే..!

Kamal Haasan: కమల్ హాసన్ విలక్షణమైన నటనకు ప్రతిరూపం. తనలోని నటనాభినయాన్ని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించిన సినిమా దశావతారం. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో కమల్ హాసన్ పది విలక్షణమైన పాత్రల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఓ చరిత్రలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఈ ఏడాదితో 13ఏళ్ళు పూర్తి అయ్యింది. అయితే ఈ కథ సినిమాగా మారడానికి పెద్ద కథే ఉందని, కమల్ హాసన్ తెలిపారు.

దశావతారం అద్భుతమైన కథ. అయితే దశావతారం కథతో ఎంతోమంది డైరెక్టర్లను సంప్రదించారట. మొదట్లో ఈ కథ అస్సలు అర్థం కాలేదట. అలాంటి సమయంలోనే రవికుమార్ కమల్ హాసన్ కు ఫోన్ చేయగా.. ఈ కథ గురించి చెప్పారట. అందుకు ఓకే అన్నారు. అలా దశావతారం సినిమా ప్రాజెక్ట్ మొదలయ్యింది.

ఇక కథల్లోని పాత్రల్లోకి వెళ్తే.. కథకు సంబంధించిన పూర్తి భాధ్యతను తీసుకోవాలని, ప్రతి విషయంలో తానే ముందుండి నడిపించాలనుకున్నారు. ఈ సినిమాకి అత్యంత ముఖ్యమైన ఘట్టం మేకప్ ఆర్టిస్ట్. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మిస్టర్ మైఖేల్ వెస్ట్ మోర్ బెంట్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

అలా 250 డాలర్స్ ఖర్చు పెట్టి మేకప్ లుక్స్ తో ఫోటోషూట్ పెట్టించారు. ఆ ఫోటోలు చూసిన నిర్మాత చాలా సర్ ప్రైజ్ అయ్యారట. అన్ని పాత్రలకు తగ్గట్టుగా మేకప్ మెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పది పాత్రల్లో వృద్ధురాలి పాత్ర చాలా కష్టంగా అనిపించిందట. అనుకున్నదానికంటే క్లైమాక్స్ లో కోటి రూపాయల పైనే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందంట.

సునామీ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా తెరకెక్కించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చిందట. దీనికి డైరెక్టర్, నిర్మాతలు కూడా అడ్డు చెప్పలేదట. అందుకే ఈ సినిమా నిర్మాణంలో కమల్ కూడా ఓ పార్టనర్ అయ్యారట. ఇక ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, టెక్నీషియన్లు ఇలా ప్రతిఒక్కరూ తమ సొంత సినిమాగా భావించారు. అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది.