vaccine: టీకా వేసుకున్న నానా తంటాలు ప‌డ్డ యంగ్ బ్యూటీ..!

క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండవం చేస్తున్న నేప‌థ్యంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా మలయాళీ నటి కళ్యాణి ప్రియదర్శన్ తొలి డోస్ తీసుకోగా, అందుకు సంబంధించిన అనుభ‌వాన్ని షేర్ చేసింది. మొదటి టీకాను తీసుకొని 24 గంటలు దాటింది… కొంచెం అలసటతో బాధపడుతున్నాను. కానీ ఉపశమనం పొందాను.నేను ఈ వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి చాలా తంటాలు ప‌డ్డాను అంటూ క‌ళ్యాణి పేర్కొంది. చెన్నైలో 18+ కి చాలా తక్కువ స్లాట్లు ఉన్నాయి. నేను 3 ఖాళీ స్లాట్లను చూశాను. కాని అవి తొంద‌ర‌గా ఫిల్ అయ్యాయి.

ప్రైవేట్ ఆసుపత్రిలో కోవాక్సిన్ – కోవిషీల్డ్ ధర వరుసగా హాస్యాస్పదంగా రూ.1250 -రూ.850. మ‌న జీవితాల‌ను సురక్షితంగా ఉంచ‌డం కోసం అంత మొత్తం చెల్లించి వేయించుకోవ‌ల‌సిన ప‌రిస్థితి . అనారోగ్యంతో ఉంటే మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోకూడదు అని కల్యాణి అన్నారు. ఇంజెక్షన్ చేసిన చోట నా చేతిలో నొప్పి పెరగడం మొదలైంది. ఇది భారీగా అనిపించింది. ఈ నొప్పి అందరికీ భిన్నంగా ఉంటుంది. నాకు ఇది చాలా బాధించింది. నేను తట్టుకోలేకపోయాను. నేను రోజంతా ప్రైమ్ లో టీవీ షోలను చూస్తూ మంచం మీద పడుకున్నా. నాకు కొంచెం అలసట అనిపించింది.. కాని జ్వరం లేదా శరీర నొప్పి లేదు. అయితే 24 గంటలు తర్వాతా నా చేయి నొప్పి ఇంకా బాధించింది. అని కల్యాణి పేర్కొంది. కళ్యాణి ప్రియదర్శిన్ తెలుగులో సాయి ధరమ్ సరసన చిత్రలహరి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అఖిల్‌తో కూడా ఓ చిత్రం చేసింది.