Kalyan ram : కల్యాణ్ రామ్ ట్రై చేస్తున్నాడు..తమ్ముడు కంటే పెద్ద హిట్ అందుకుంటాడా..?

Kalyan ram : కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఫస్ట్ టైం మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇంతక ముందు కల్యాణ్ రామ్ నిర్మాతగా తమ్ముడు ఎన్.టి.ఆర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో నటించి తాత నందమూరి తారకరామారావు గారిని గుర్తు చేశాడు. ముఖ్యంగా రావణ పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పక తప్పదు. ఈ పాత్రలో తారక్ జీవించాడు. ఇక మిగతా రెండు పాత్రల్లో కూడా తారక్ పర్ఫార్మెన్స్ మహాద్భుతం అని ఎంతో మంది ప్రశంసించారు.

kalyan-ram-is-trying-to-get-a-big-hit
kalyan-ram-is-trying-to-get-a-big-hit

అయితే ఇప్పుడు ఇలా మూడు పాత్రల్లో కల్యాణ్ రామ్ మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ‘ఎమిగోస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయాలని ట్రై చేస్తున్నారట.

Kalyan ram : కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా 2022లోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

అయితే కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సస్ అందుకుంటాడో అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కల్యాణ్ రామ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఎంత మంచి వాడవురా సినిమా వచ్చి ఫ్లాప్‌గా మిగిలింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా ఇదే. ఇక కరోనా తర్వాత మరో రెండు సినిమాలు ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా 2022లోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Advertisement