Bimbisara: మూడు భాగాలుగా ‘బింబిసార’ .. రిస్క్ చేస్తున్నాడంటారా!

Bimbisara: బింబిసార.. ఈ పేరు మొన్నటివరకు చాలామందికి తెలియదు. కానీ కళ్యాణ్ రామ్ పుణ్యమా అని బింబిసారుడి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈయన మగధ సామ్రాజ్యంలోని హర్యాంక రాజవంశానికి చెందిన ఒక రాజు. చరిత్ర గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే బింబిసారుడు చరిత్ర గురించి తెలుస్తుంది. అలాంటి రాజు జీవిత చరిత్రతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

bimbisara

కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. చాలా సైలెంట్ గా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. మిగిలిన భాగం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఈ సినిమా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై 40 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు నందమూరి హీరో.

ఆయన మార్కెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ అని తెలిసినా కూడా కథను నమ్మి ముందుకు వెళ్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇది వర్కౌట్ కావడానికి బింబిసార సినిమా ఏకంగా మూడు భాగాల కింద చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తొలి భాగం హిట్టయితే ఆటోమేటిక్ గా మిగిలిన రెండు భాగాలు పై అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

bimbisara

ఇదంతా ఇలా ఉంటే అన్నయ్య సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సాయం చేస్తున్నాడు. బింబిసారుడి జీవిత చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాత్రదానం చేయనున్నాడు. గతంలో కొన్ని సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నయ్య సినిమాకు కూడా ఇదే చేయబోతున్నాడు. ఖచ్చితంగా బింబిసార సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ హెల్ప్ అవుతుందని కళ్యాణ్ రామ్ బలంగా నమ్ముతున్నాడు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది.

క‌ళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. న‌టుడిగా ప‌టాస్ చిత్రం త‌ప్ప ఏ సినిమా ఆయ‌న‌కు పెద్ద విజ‌యం అందించ‌లేదు. బింబిసార‌పై ఆయ‌న చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక నిర్మాత‌గా జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు.