Kalyaan Dev : కుమార్తెను తలచుకుని ఎమోషనల్ అవుతున్న చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.!
NQ Staff - January 12, 2023 / 01:36 PM IST

Kalyaan Dev : మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గత కొంతకాలంగా తన భార్య శ్రీజకి దూరంగా వుంటోన్న విషయం విదితమే. శ్రీజ ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. పలు సినిమాల నిర్మాణం దిశగా సమాలోచనలు చేస్తోంది. అదే సమయంలో, చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్స్ తదితర వ్యవహారాలు అక్కతో కలిసి చూసుకుంటోంది శ్రీజ.
మరి, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఏం చేస్తున్నట్టు.? చేతిలో కొన్ని సినిమాలున్నా.. కెరీర్ పరంగా కొంత బ్యాడ్ ఫేజ్లో వున్నాడు. కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడిపోయారు.. ఇది అధికారికం కావాల్సి వుంది.
కుమార్తెపై బెంగతో..
కాగా, కళ్యాణ్ దేవ్ – శ్రీజల కుమార్తె నివిష్క.. తన తల్లి దగ్గరే వుంటోంది. ఈ నేపథ్యంలో తరచూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతున్నాడు కళ్యాణ్ దేవ్. తాజాగా కూతురు నివిష్కని ఉద్దేశించి ‘చాలా మిస్ అవుతున్నా..’ అంటూ పోస్ట్ పెట్టాడు కళ్యాణ్ దేవ్. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
అసలు సమస్య ఏంటన్నదానిపై ఎక్కడా స్పష్టత దొరకడంలేదు. శ్రీజ మరో పెళ్ళికి సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని మెగా కాంపౌండ్ ఇంతవరకు ఖండించలేదు.