Kalki First Glimps : కల్కి 2898 ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్ లో సీన్లు.. భవిష్యత్ లో జరిగే కథ..!
NQ Staff - July 21, 2023 / 01:30 PM IST

Kalki First Glimps : ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. అసలు ఇందులో ప్రభాస్ ఎలా ఉంటాడనేది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఈ రోజు అమెరికాలోని కామిక్ కాన్ శాన్ డియాగో ఈవెంట్‌లో `ప్రాజెక్ట్ కే` అసలు పేరుని, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
దీంతో ఈ గ్లింప్స్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇందులో ప్రాజెక్ట కే పేరును కల్కి 2898 ఏడీగా ఖరారు చేశారు. ఈ కథ దాదాపు భవిష్యత్ లో అంటే.. 875 ఏళ్ల తర్వాత జరగబోతోంది. ఈ గ్లింప్స్ లో.. కొందరు సూపర్ పవర్ కలిగిన శత్రువులు సామాన్య ప్రజలను బంధిస్తారు. వారిని చిత్ర హింసలకు గురి చేస్తారు.

Kalki First Glimps
ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ?
అప్పుడు వారిని కాపాడేందుకు ప్రభాస్ సూపర్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు. వారితో పోరాడి వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇందులో చూపించారు. ఇందులో ఆయన లుక్స్ బెటర్ గానే ఉన్నాయి. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అసలు అని ప్రత్యర్థి ప్రశ్నిస్తాడు. అంటే ప్రాజెక్ట్ కే అనేది ఈ సినిమాలో కీలకం అని తెలుస్తోంది.
ఇది ఒక మిషిన్ అయి ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇందులో కొన్ని సీన్లు, యాక్షన్ ఎలివెంట్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నట్టు ఉంది. ఫస్ట్ లుక్ తో వచ్చిన విమర్శలకు ఈ టీజర్ తో చెక్ పెట్టారనే చెప్పుకోవాలి. ఇది 2024లో రిలీజ్ కాబోతోంది. ప్రపంచాన్ని చీకటి అధీనంలోకి తీసుకున్నప్పుడు అంతం ప్రారంభం అవుతుందని క్యాప్షన్ ఇచ్చారు. చూస్తుంటే ఇదంతా వేరే గ్రహం మీద ఏమైనా జరుగుతుందా అని అనిపిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్, ప్రభాస్ కనిపించారు. కమల్ హాసన్ పాత్ర ఇంకా షూట్ చేయలేదు.