హనీమూన్ టూర్ పొడిగించుకున్న కాజల్.. మరో ప్రదేశానికి వెళతారా ఏంటి?
Samsthi 2210 - November 12, 2020 / 12:36 PM IST

కుందనపు బొమ్మ కాజల్ అగర్వాల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నచ్చిన ప్రియుడితో ఏడడుగులు వేసిన కాజల్ ప్రస్తుతం హనీమూన్ టూర్‌తో బిజీబిజీగా ఉంది. అక్కడి ప్రకృతిని మంచి గా ఎంజాయ్ చేస్తూ, టూర్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. కాజల్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు.
అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ కొద్ది రోజులకి కుటుంబ సభ్యుల మధ్య రిసెప్షన్ జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కరోనా వలన సినిమా సెలబ్రిటీలు ఎవరిని తన పెళ్లికి కాని, రిసెప్షన్‌కు ఆహ్వానించని కాజల్ ఇప్పుడు వారి కోసం ప్రత్యేకంగా చెన్నై, హైదరాబాద్ నగరాలలో రిసెప్షన్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అందరు హాజరు కానున్నారట.
ఇక కొద్ది రోజులుగా మాల్దీవులలో బిజీ లైఫ్ గడుపుతున్న కాజల్ మరి కొద్ది రోజుల పాటు తన హనీమూర్ పొడిగించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలోనే కాజల్ హైదరాబాద్‌కు వచ్చి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కాని చిరంజీవికి కరోనా రావడంతో కొద్ది రోజుల పాటు షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో కాజల్-గౌతమ్‌లు మరో ప్రదేశానికి టూర్‌గా వెళ్ళనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు పారిస్ పారిస్, ముంబై సాగా , భారతీయుడు 2 చిత్రాలతో బిజీగా ఉంది కాజల్. పెళ్ళి తర్వాత ఈ అమ్మడు తన పేరుని కాజల్ అగర్వాల్ నుండి కాజల్ కిచ్లుగా మార్చుకుంది.