Kajal : కాజల్ పెళ్ళి తర్వాత అలాంటి పాత్రలు చేసేందుకు రెడీ అంటోంది..!
Vedha - March 26, 2021 / 09:16 AM IST

Kajal : కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇటీవలే మోసగాళ్ళు సినిమా తో వచ్చిన కాజల్ అగర్వాల్ మేలో ఆచార్య సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ లో ముంబై సాగా సహా మరికొన్ని సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా అక్కినేని నాగార్జున సరసన నటించే అవకాశం అందుకుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా పెళ్ళి తర్వాత ఏ హీరోయిన్‌కైనా అవకాశాలు తగ్గిపోతాయి. లేదా వాళ్ళే కొంతకాలం సినిమాలకి దూరమవుతారు.

kajal-is-ready-to-act-in-those-roles
కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు రివర్స్. పెళ్ళికి ముందు ఎలాగైతే వరసగా సినిమాలు చేసిందో..పెళ్ళి తర్వాత కూడా అలాగే క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే ఇన్నాళ్ళు హీరోయిన్ గా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు కొత్త తరహా పాత్రలు చేసేందుకు సిద్దం అవుతోంది.ఇన్నాళ్ళు కమర్షియల్ సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసిన కాజల్ అగర్వాల్ కెరీర్ లో చేయాల్సిన సినిమా రోల్స్ కొన్ని ఉన్నాయట.
Kajal : కాజల్ అగర్వాల్ భర్త గౌతం కిచ్లు తో కలిసి బిజినెస్ కూడా మొదలు పెట్టింది.
తను నటించే సినిమాలలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేయాలని చాలా ఆతృతతో ఉందట. ఇక బయోపిక్స్.. చారిత్రాత్మిక.. పౌరాణిక సినిమాలు చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే విలన్ పాత్రలు వస్తే ఏమాత్రం ఆలోచించకుండా చేసేందుకు ఒకే చెప్తానంటు వెల్లడించింది. చూడాలి మరి కాజల్ అగర్వాల్ కి విలన్ రోల్స్ వస్తాయో లేదో. కాగా ఇలా వరసగా సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ భర్త గౌతం కిచ్లు తో కలిసి బిజినెస్ కూడా మొదలు పెట్టింది.