Kajal: మెల్ల‌గా త‌న భ‌ర్త‌ని కూడా ఇండ‌స్ట్రీలోకి తీసుకొస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal: సినిమా ప‌రిశ్ర‌మ‌లో వార‌స‌త్వం కొత్తేమి కాదు. ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్నారు. ఇక‌ స్టార్ హీరోయిన్ల భర్తలు సైతం తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. ఇది విని అభిమానులు స్ట‌న్ అవుతున్నారు.

TheNewsQube-
kajal husband also coimg to industry1
kajal husband also coimg to industry1

టాలీవుడ్ చందమామ కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి చేసుకోంది. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూనే ఉంది కాజల్. ఇంకా చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ సంచలన పాత్రల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమాలో వేశ్యగా నటిస్తుంది కాజల్. స్పైగా కనిపిస్తూనే ఉగ్రవాదుల సీక్రేట్స్ తెలుసుకోడానికి వేశ్యగా కనిపించే పాత్ర ఇది.

అయితే తాను న‌టించే సినిమాల‌లో ఒక చిన్న పాత్రలోనైనా గౌతమ్ కనిపించేలా చూడమని కోరుతుందంట కాజ‌ల్ . భర్త గౌతమ్ కోసం కాజల్ కొన్ని కండీషన్లు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అవి విన్న తర్వాత దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె కోరికలే అలా ఉన్నాయి మరి.

తను నటించే సినిమాల్లోనే భర్తకు కూడా కారెక్టర్ ఇవ్వాలంటూ దర్శకులకు కాజల్ అల్టిమేటం పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. చిన్న పాత్రైనా పర్లేదు.. కీలకంగా ఉంటే చాలంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్ కోసం ఒక వీడియో షూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

kajal husband also coimg to industry
kajal husband also coimg to industry

గౌతమ్ కి కూడా నటనపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కాజల్ తన భర్తని ముందుండి ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. గౌతమ్ కూడా చూడడానికి హీరోలని ఉంటాడని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే గౌతమ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారనుంది.