Kajal Agarwal : వీడియో : కాజల్ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చింది.. ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

NQ Staff - September 22, 2022 / 11:01 AM IST

160045Kajal Agarwal : వీడియో : కాజల్ మళ్లీ ఫామ్‌ లోకి వచ్చింది.. ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ

Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు అన్నింటికీ చెక్‌ పెడుతూ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కి సిద్ధమైంది.

Kajal Agarwal, Kajal, Kajal Horse Riding, Kajal Updates

Kajal Agarwal, Kajal, Kajal Horse Riding, Kajal Updates

గతంలో కాజల్ అగర్వాల్ ఎలా అందంగా కనిపించిందో అంతకు రెట్టింపు అందంగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మాదిరిగానే మంచి ఫిజిక్ ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే వర్కౌట్ లు మొదలు పెట్టింది.

బిడ్డకు జన్మనిచ్చిన కేవలం నాలుగు నెలల్లోనే కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడంను ఆమె అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ప్రస్తుతం ఇండియన్‌ 2 సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నట్లుగా కాజల్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా గుర్రపు స్వారీ నేర్చుకోవడంతో పాటు పలు విషయాల పట్ల మళ్లీ అవగాహన పెంచుకుంటూ గతంలో మాదిరిగా యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశంతో వరుస సినిమాలను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

డెలివరీ తర్వాత నాలుగు నెలల గ్యాప్ వచ్చింది.. అయినా కూడా ఇప్పుడు మొదలు పెడితే అంతా కొత్తగా ఉంది అన్నట్లుగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో రాసుకోవచ్చు. తాను ప్రస్తుతం ఒక కొత్త హీరోయిన్ అన్నట్లుగా అన్ని విషయాలను నేర్చుకుంటున్నానని.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని కాజల్ అగర్వాల్ పేర్కొంది.

తాను మళ్లీ ఒక కొత్త హీరోయిన్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రావాలి అన్నట్లుగా భావిస్తున్నానంటూ కాజల్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. తాజాగా గుర్రపు స్వారీ వీడియో షేర్ చేసి అభిమానులతో తాను మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వబోతున్నట్లుగా చెప్పకనే చెప్పింది. కాజల్‌ అగర్వాల్ గుర్రపు స్వారీ వీడియోలో చాలా అందంగా కనిపిస్తుండడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.