VIRAL PIC: ఈ ముసుగు వీరులెవ‌రో గుర్తు ప‌ట్టారా.. మాస్క్‌లోను క్యూట్‌గా ఉన్నారే..!

ఒక్కసారి కాస్త జాగ్రత్తగా గమనించండి.. ఈ ముసుగు సుందరిని ఎక్కడో చూసినట్లుంది కదా..? మరోసారి జాగ్రత్తగా చూడండి.. మీకు కచ్చితంగా చూసిన గుర్తు దొరుకుతుంది. మీరు ఊహించిన హీరోయిన్ కరెక్టే.. ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. మెగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ తో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. లాక్ డౌన్ కాకపోయినా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు లాక్ డౌన్ పరిస్థితులే ఇప్పుడు కొనసాగుతున్నాయి. అందుకే దొరికిన సమయాన్ని హాయిగా భర్తతో గడిపేస్తుంది కాజల్ అగర్వాల్. పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తుంది కాజల్. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత కూడా కాజల్ కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

పెళ్లికి ముందైనా.. తర్వాతైనా తన కెరీర్ ఒకేలా ఉందని చెప్పుకొచ్చింది చందమామ. ఇప్పటికీ ఈమె కెరీర్ అలాగే సాగుతుంది కూడా. వరస సినిమాలకు కమిట్ మెంట్ ఇస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో చిరంజీవి ఆచార్య.. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ లేకపోవడంతో భర్తతోనే ఉంటుంది. కరోనా సమయంలో సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా భర్తతో కలిసి మాస్క్ పెట్టుకుని సెల్ఫీ తీసుకుంది. ఈ ఫోటోలో భర్త గౌతమ్ కిచ్లుతో పాటు కాజల్ మాస్కులు పెట్టుకొని ఉండటంతో గుర్తు పట్టడం కష్టంగా మారిపోతుంది..

గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలోనే వివాహం చేసుకుంది కాజ‌ల్‌.. కొద్ది మంది స‌న్నిహితులు, బంధువుల స‌మ‌క్షంలో కాజ‌ల్ వివాహం జ‌ర‌గ‌గా, వీరికి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్‌కు కూడా వెళ్లిన ఈ జంట అక్క‌డ తెగ సంద‌డి చేసి ర‌చ్చ చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ప్ర‌స్తుతం షూటింగ్స్ కూడా లేక‌పోవ‌డంతో భ‌ర్త‌తో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గడుపుతుంది.

Advertisement