Kajal Aggarwal: ఎడముఖం పెడముఖం..కాజల్, గౌతమ్ కిచ్లు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ..!

Kajal Aggarwal: కొత్తగా పెళ్ళైన వాళ్లను ఏం చేస్తున్నారు అని అడగడం కంటే దారుణమైన విషయం మరోటి ఉండదు. ఎందుకంటే అలా అడగడం కూడా క్రైమ్ కిందే లెక్క అని సరదాగా పోస్టులు పెడుతుంటారు. అలాగే ఇప్పుడు కాజల్, గౌతమ్ కిచ్లును కూడా ఏం చేస్తున్నారని అడక్కూడదు. ఎందుకంటే వీళ్లకు పెళ్లై ఏడాది కూడా కాలేదు.

Kajal Aggarwal
Kajal Aggarwal

గతేడాది ఏడడుగులు వేశారు ఈ ఇద్దరూ. అప్పట్నుంచి హాయిగా టైమ్ దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కాస్త కంట్రోల్ అయిన తర్వాత ఫారెన్ ట్రిప్ కూడా వెళ్లొచ్చారు. మరోవైపు కాజల్ అగర్వాల్ మ్యారేజీ లైఫ్ తో పాటు సినిమాలు కూడా వరసగా చేస్తూనే ఉంది. ఆ మధ్య ఆచార్య షూటింగ్ లొకేషన్ కు భర్తతో పాటు కలిసొచ్చిన కాజల్ కు శాలువా కప్పి సన్మానం కూడా చేసాడు చిరంజీవి.

ప్ర‌స్తుతం నాగార్జున సినిమాలోనూ నటిస్తుంది చందమామ. పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లే అంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది. పైగా ప్రవీణ్ సత్తారు, నాగార్జున సినిమాలో వేశ్యగా నటించబోతుందని తెలుస్తుంది. అంతేకాదు.. అదే పాత్ర చివరికి స్పై అని తెలుస్తుంది.. అది మరో ట్విస్ట్. ఇదిలా ఉంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్, గౌతమ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో ఇద్దరూ ఎవరి పని వాళ్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.

ఈ ఫోటోకు చిత్ర విచిత్రమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అందులో సీరియస్‌గా కాజల్ బుక్ చదువుతుంటే.. గౌతమ్ ల్యాప్ ట్యాబ్ లో తన పని తాను చేసుకుంటున్నాడు. కొత్తగా పెళ్లైంది.. ఇంట్లో ఉన్నపుడైనా కాస్త ఎంజాయ్ చేయొచ్చుగా.. మరీ ఇంతలా పనిలో నిమగ్నమైపోవాలా అంటూ కామెడీగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఎడ‌మొఖం పెడ‌మొఖంలా పెట్టుకున్నారెందుకు అని మ‌రి కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళైంది కదా అని పనులన్నీ మానేసుకోలేంగా అంటుంది కాజల్