KAJAL: కాజ‌ల్‌ది ఎంత మంచి మ‌న‌సు.. కోట్లు ఖ‌ర్చు పెట్టి క‌రోనా వ్యాక్సిన్ వేయిస్తుంద‌ట‌..!

Samsthi 2210 - March 19, 2021 / 11:13 AM IST

KAJAL: కాజ‌ల్‌ది ఎంత మంచి మ‌న‌సు.. కోట్లు ఖ‌ర్చు పెట్టి క‌రోనా వ్యాక్సిన్ వేయిస్తుంద‌ట‌..!

KAJAL టాలీవుడ్ గ్లామ‌రస్ హీరోయిన్స్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒకరు. ఇండ‌స్ట్రీలో 15 సంవ‌త్స‌రాలుగా త‌న సేవ‌లందిస్తున్న కాజ‌ల్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకుంది. కరోనా వ‌ల‌న కొద్ది మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య కాజ‌ల్ వివాహం జ‌రిగింది. అయితే పెళ్లి త‌ర్వాత కాజ‌ల్‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. సినిమా ఎంపిక, బిజినెస్‌, ఫ్యూచ‌ర్‌పై దృష్టి, మ‌నుషుల‌తో ఎలా మ‌సులుకోవాలి వంటివి కొత్త‌గా కాజ‌ల్‌లో క‌నిపిస్తున్నాయి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం కాజ‌ల్‌ది కాగా, తాజాగా ఈ అమ్మ‌డు చేసిన కామెంట్స్ అభిమానుల‌నే కాక ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజ‌ల్ అగ‌ర్వాల్ రీసెంట్‌గా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించింది. ప‌లు విష‌యాల‌ పై ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చింది. క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో తాను ఇచ్చిన స‌మాధానం అంద‌రి మన‌సులు గెలుచుకునేలా చేసింది. ఓ నెటిజన్ .. మీకు వేల కోట్ల రూపాయ‌లు వ‌స్తే ఏం చేస్తారు అని కాజ‌ల్‌ని ప్ర‌శ్నించాడు. దీనికి స‌మాధానంగా నాకే క‌నుక కోట్ల రూపాయ‌లు వ‌స్తే దేశంలో ఉన్న వారంద‌రికి క‌రోనా వ్యాక్సిన్ ఇప్పిస్తానంటూ స‌ర్‌ప్రైజింగ్ కామెంట్స్ చేసింది. ఇదేదో మిస్ వ‌రల్డ్ పోటీ కోసం చెప్పిన స‌మాధానం కాదు, మ‌న‌స్పూర్తిగా చెబుతున్నాను అంటూ కాజ‌ల్ త‌న పోస్ట్‌లో పేర్కొంది.

కాజ‌ల్ కెరియ‌ర్ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు న‌టించిన వెబ్ సిరీస్ ఒకటి ఇటీవ‌ల ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇది అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇక ఈ రోజు విష్ణుతో క‌లిసి న‌టించి మోస‌గాళ్లు చిత్రం రిలీజ్ అవుతుంది. రియ‌ల్ స్టోరీ నేప‌థ్యంలో సాగిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ సోద‌రి పాత్ర‌లో క‌నిపించి అలరించ‌నుంది. ఇక చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.రీసెంట్‌గా నాగార్జున‌- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలోను కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. మొత్తానికి ఎంత ఎదిగిన ఒదిగి ఉండే కాజ‌ల్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us