హనీమూన్‌లో హాట్‌హాట్‌గా కాజల్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నఫొటోలు
Samsthi 2210 - November 8, 2020 / 05:58 PM IST

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి కాజల్ అగర్వాల్ కాస్త కాజల్ కిచ్లుగా మారింది. ఇటీవల తామూ హనీమూన్‌కు వెళుతున్న విషయాన్ని కన్‌ఫాం చేస్తూ పాస్ పోర్ట్ ఫొటోలు షేర్ చేయగా, అందులో కాజల్ కిచ్లు అని ఉంది. ఇక ఇప్పటి నుండి కాజల్ పేరు ఎక్కడ కనిపించిన కిచ్లు అనే ఉంటుందనే విషయం అర్ధమైంది. ఇక ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఈ జంట హనీమూన్ వెళతారని అందరు భావించినప్పటికీ, శనివారం వీరు మాల్దీవుస్‌లో వాలినట్టు తెలుస్తుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ మాల్దీవుస్‌లో తన భర్తతో దిగిన సెక్సీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో కాజల్ సాగరతీరాన రెడ్ కలర్ డ్రెస్‌లో హోయిలు పోతూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఇన్నాళ్ళు ఇంత అందాలు ఎక్కడ దాచావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మాల్దీవుస్‌లో తన భర్తతో కాజల్ అపురూపమైన క్షణాలని గడుపుతుందని ఈ ఫొటోలని చూస్తే అర్ధమవుతుంది. దాదాపు వీరి హనీమూన్ టూర్ వారంకి పైగా ఉండనుందని సమాచారం.
హనీమూన్ నుండి వచ్చాక కాజల్ టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ జరుపుకోవాలని భావిస్తుందట. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లని త్వరగా పూర్తి చేయాలని తన టీంకి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ రిసెప్షన్ పూర్తైన తర్వాత వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీ కానుంది కాజల్. మొదట ఆచార్య అనే సినిమా షూటింగ్‌లో పాల్గొననున్న కాజల్ ఆ తర్వాత కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ ఖాతాలో తెరకెక్కనున్న భారతీయుడు 2 చేయనుంది. మోసగాళ్ళు, ముంబై సాగా అనే చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలోను కూడా ఈ అమ్మడు నటించనుంది.