Kajal: పెళ్లి త‌ర్వాత రూట్ మార్చిన కాజ‌ల్‌.. స‌మంత బాట‌లోనే ప‌య‌నిస్తుందా?

Kajal: అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ప‌రిచ‌యం ఉన్న‌వారిని లేదంటే స‌ద్గుణ‌వంతుడిని చూసి మ‌నువాడుతున్నారు. గ‌త ఏడాది అందాల చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్ ..గౌత‌మ్ కిచ్లు అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం అత‌నితో సంతోష‌మైన జీవితం గ‌డుపుతుంది. అయితే పెళ్లి త‌ర్వాత కూడా కాజ‌ల్ వ‌రుస ఆఫ‌ర్స్‌తో దూసుకెళుతుంది. స‌మంత మాదిరిగా కథల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి కాజల్ కి ఎప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినా చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే 36 ఏళ్ల వయసులో కాజల్ ఇప్పుడు అటువైపు చూస్తోంది.

తెలుగు తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న కాజల్ ప్ర‌స్తుతం ఆచార్య అనే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా షెడ్యూల్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వ‌ర‌లో
నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో చిత్రం తెరకెక్క‌నుండ‌గా, ఇందులోను కాజ‌ల్ క‌థ‌నాయిక‌గా ఎంపికైంది. ఇలా వ‌రుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్న కాజ‌ల్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. తధాగతట సింఘ దర్శకత్వంలో `ఉమ` అనే చిత్రం పెళ్లి నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కనుండ‌గా ఇందులో కాజ‌ల్ లీడ్ రోల్ పోషిస్తుంది. పూర్వీకులకు చెందిన పాత కాలం ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక అపరిచితురాలైన ఉమా రాకతో ఇంట్లో ఎలాంటి ట్విస్టు బయటపడింది? అన్నది ఆసక్తిక‌రంగా చూపించ‌నున్నార‌ట‌.

అవిషేక్ ఘోష్ (అవ్మా మీడియా) & మంత్రరాజ్ పాలివాల్ (మిరాజ్ గ్రూప్) ఈ చిత్రానికి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గాక సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 2021 సెకండాఫ్ లో ఒకే సుదీర్ఘ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేస్తారట. ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడి చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌వీణ్ స‌త్తారు చిత్రంలో కాజల్ `రా` ఏజెంట్ గా కనిపిస్తుందట. ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ లుక్‌లో, భిన్న బాడీ లాంగ్వేజ్ తో తను సర్ ప్రైజ్ చేయబోతోందట. త‌న పాత్ర కోసం కాజల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్ కి సంబంధించి తర్ఫీదు తీసుకుంటుందట. ఏదేమైన రానున్న రోజుల‌లో కాజ‌ల్ ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.