Kajal: గ్రీకు శిల్పంలా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. అమ్మ‌డి అందాల‌కు అంతా ఫిదా

Tech Sai Chandu - October 18, 2021 / 04:11 PM IST

Kajal: గ్రీకు శిల్పంలా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. అమ్మ‌డి అందాల‌కు అంతా ఫిదా

Kajal పెళ్లైన త‌ర్వాత కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ట్రెడిష‌నల్ డ్రెస్సుల‌తో పాటు స్టైలిష్ డ్రెస్సుల‌లో కేక పెట్టిస్తుంది. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.

కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంది. దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలతో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న ‘ఘోస్ట్’ మూవీలో అక్కినేని నాగార్జున నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, ఈ మూవీ నుంచి ఆమె తప్పుకున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

గ‌త ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ప‌లు సినిమాల నుండి త‌ప్పుకుంటూ ఉండ‌డంతో అంద‌రిలో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పెళ్లైన కూడా గ్లామ‌ర్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అందాలు ఆర‌బోయ‌డమే కాకుండా క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ గ్లామ‌ర్ షోకి అంతా ఫిదా అవుతున్నారు.

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us