KAJAL AGGARWAL: నాగార్జున స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి త‌ర్వాత కూడా మంచి స్పీడు మీదుంది. కుర్ర హీరోలు, సీనియ‌ర్ హీరోల ప్రాజెక్టుల‌కు సైన్ చేస్తూ యువ హీరోయిన్స్‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన మోస‌గాళ్లు చిత్రం మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో విష్ణుకు అక్క‌గా న‌టించింది. ఈ సినిమాతో కాజ‌ల్ రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య అనే సినిమాలో రొమాన్స్ చేస్తుండగా, ఈ సినిమా మే 13న విడుద‌ల కానుంది. మ‌రోవైపు నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు కాజ‌ల్ ఇటీవ‌ల తెలియ‌జేసింది . తాజాగా దానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

క్రేజీ ప్రాజెక్టుల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు .. నాగార్జున హీరోగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ మూవీని రూపొందించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా చాలా మంది హీరోయిన్స్‌ను ప‌రిశీలించి చివ‌ర‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఫైన‌ల్ చేశారు. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఇప్పటికే గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని మెయిన్ సీన్ల తాలుకూ షూటింగ్ జరుగుతోంది. అక్కడ షూటింగ్ పూర్తవ్వగానే హైదరాబాద్‌లో జరగనుంది.

హైద‌రాబాద్‌లో జ‌రిగే షూటింగ్‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ అందుబాటులో ఉంటుంద‌ట‌. చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ది మంచి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర కాగా, అందుకే ఈ భామ వెంట‌నే సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక చిత్రంలో నాగార్జున ..రా ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగానే అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌, మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది. ముఖ్యంగా సినిమా మొత్తం హీరో పాత్ర, మేనకోడలు పాత్రతో మెయిన్‌ కాన్సెప్ట్‌ ముడిపడి ఉంటుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. కాజ‌ల్ తొలిసారి నాగార్జున స‌ర‌స‌న న‌టిస్తుండ‌గా, వీరిద్ద‌రి రొమాన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Advertisement