Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ లిప్ లాక్.! వైరల్ అవుతోన్న ఫొటో.!
NQ Staff - December 26, 2022 / 05:32 PM IST

Kajal Aggarwal : అరరె.! కాజల్ అగర్వాల్‌కి ఏమయ్యింది.? ఆమె ఎందుకు ట్రోలింగ్‌ని ఎదుర్కొంటోంది.? అసలెందుకిలా చేసింది. సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ పేరు మార్మోగిపోతోందంటే, అందుక్కారణం ఓ ఫొటో.!
ఔను, కాజల్ అగర్వాల్ లిప్ లాక్ పెట్టేసింది.! ఇంకేముంది.? ‘ఇదేం పద్ధతి.?’ అంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇంతకీ, కాజల్ అగర్వాల్ లిప్ లాక్ పెట్టింది ఎవరికో తెలుసా.? ఇంకెవరికి, ఆమె భర్తకే. అద్గదీ సంగతి. అయినా, ఇందులో వింతేముంది.? తప్పేముంది.?
తప్పులేదు గానీ..

Kajal Aggarwal Applied Lip Lock Gautam Kichlu
అసలు ఈ బహిరంగ శృంగారం అవసరమా.? అంటూ నెటిజన్లు కాజల్ అగర్వాల్ మీద మండి పడుతున్నారు. కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుకి ముద్దు పెట్టేసింది. అది కూడా పెదాల మీద ముద్దు ఇది. గతౌమ్ కిచ్లుకి కాజల్ ముద్దు పెడుతున్న సమయంలో కాజల్ కొడుకు, తన తండ్రి చేతుల్లో వున్నాడు.
క్రిస్మస్ సందర్భంగా కాజల్ స్వయంగా విడుదల చేసిన ఫొటో ఇది. చాలామంది బ్యూటిఫుల్ ఫొటో.. అని కామెంట్ చేస్తోంటే, కొందరు మాత్రం ఈ పొటో నేపథ్యంలో కాజల్‌ని ట్రోల్ చేస్తున్నారు.
ఇక, కాజల్ చేతిలో ‘భారతీయుడు-2’ తదితర సినిమాలున్న సంగతి తెలిసిందే.