Kajal: కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌ర్భ‌వ‌తా.. కుటుంబ స‌భ్యులు ఏమంటున్నారు..!

Kajal: దాదాపు 15 ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ గత ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న చిన్ననాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న వీరిద్ద‌రి వివాహం కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగింది. పెళ్లైన కొద్ది రోజుల‌కే ఈ జంట మాల్దీవుల‌కి హనీమూన్ కోసం వెళ్లారు. అక్క‌డ అంద‌మైన ప్ర‌దేశాల‌లో విహ‌రిస్తూ ఫొటోలు దిగారు. ఆ ఫొటోల‌ను కాజ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, అవి తెగ వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం కాస్త గ్యాప్ దొరికిన స‌రే భ‌ర్త‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ఆస‌క్తి చూపుతుంది కాజ‌ల్. ఇటీవ‌ల కాజ‌ల్ బ‌ర్త్ డే జ‌ర‌గ‌గా, ఇది పెళ్లైన తొలి బ‌ర్త్‌డే. కరోనా వ‌ల‌న త‌న భ‌ర్త , చెల్లితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది. అయితే కాజ‌ల్‌కి బ‌ర్త్‌డే విషెస్ చెప్పే క్ర‌మంలో నిషా అగ‌ర్వాల్ త్వరలో కాజల్‌ తల్లి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా మూడేళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారు’ అన్నారు.

ఈ కామెంట్‌తో గాసిప్ రాయుళ్లు కాజల్ ప్రస్తుతం గర్భవతి అనే వార్తలు వైరల్ చేసేశారు . పెళ్లి ఎలాగైతే సీక్రెట్‌గా ఉంచిందో.. ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా అలాగే దాచేస్తోందని చెప్పుకున్నారు. సోష‌ల్ మీడియాలోను, ఫిలిం న‌గ‌ర్‌లోను ఇదే విష‌యంపై చ‌ర్చ న‌డ‌వ‌గా, దీనిపై కాజ‌ల్ కుటుంబ స‌భ్యులు రియాక్ట్ అయ్యారు. కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదు. అవ‌న్నీ రూమర్స్ అంటూ పూర్తి క్లారిటీ ఇచ్చింది.

ఆచార్య‌, ఇండియ‌న్ 2, ఉమా, నాగార్జున చిత్రంతో బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. కెరీర్ ఇంత పీక్ స్టేజ్‌లో ఉండ‌గా, తాను అప్పుడే ప్ర‌గ్నెన్సీ ప్లాన్ చేసుకోద‌ని, అయిన పెళ్లై కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్ర‌గ్నెన్సీ ఏంటి అంటూ గాసిప్ రాయుళ్ల‌పై కొంద‌రు నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. కాగా, చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన ఆచార్య చిత్రం ద‌సరా కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.