Balakrishna : అప్పుడు నో చెప్పిన కాజల్ ఇప్పుడు బాలయ్యకు ఓకే చెప్పేనా?
NQ Staff - January 24, 2023 / 10:34 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ కు జోడీగా నటించాల్సిందిగా అయిదు ఆరు సంవత్సరాల క్రితం కాజల్ అగర్వాల్ ను అడిగిన సమయంలో బిజీగా ఉన్నాను డేట్లు ఖాళీ లేవు అన్నట్లుగా సమాధానం ఇచ్చిందట. ఆ సమయంలో బాలయ్య కు జోడీగా మరో హీరోయిన్ ను తీసుకు రావాల్సి వచ్చింది.
బాలయ్య సినిమా లో నటించే అవకాశం కాజల్ అగర్వాల్ కు రెండు సార్లు వచ్చిందట. రెండు సార్లు కూడా కావాలని సినిమాను కాదనుకుందట. అందుకు కారణం బాలకృష్ణ తో సినిమా చేస్తే యంగ్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావని ఆమె భావించి ఉంటుంది అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కాజల్ అగర్వాల్ పెళ్లి అయ్యింది. తల్లిగా కూడా ఆమెకు ప్రమోషన్ వచ్చింది. ఇలాంటి సమయంలో బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే ఎలా రెస్పాండ్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈసారి బాలయ్య కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పిందట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా లో కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం కోసం చర్చలు జరిగాయి అని.. కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఓకే చెప్పిందని తెలుస్తోంది. గతంలో నో చెప్పిన కాజల్ ఇప్పుడు బాలయ్య సినిమాలో చేసేందుకు ఓకే చెప్పడం తో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.