Kajal Agarwal : కాజల్ ‘హాట్’ కసరత్తులు.! ఈ సారి వేరే లెవల్.!
NQ Staff - September 26, 2022 / 08:33 AM IST

Kajal Agarwal : చందమామ కాజల్ అగర్వాల్ తెగ కష్టపడిపోతోంది. ఇటీవలే తల్లిగా మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించి వచ్చిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు కత్తి పట్టి, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ తెగ చెమటలు కక్కేస్తోంది.మెున్నీ మధ్యనే గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఏకంగా మార్షల్ ఆర్ట్స్ చేసేస్తోంది.
ట్రైనర్ సమక్షంలో సీరియస్‌గా ఫీట్లు చేస్తోంది చందమామ.‘కళరియపట్టు..’ అనేది ప్రాచీన కేరళ యుద్ధ కళ. కరాటే, టైక్వాండో, కుంగ్ పూ తదితర మార్షల్ ఆర్ట్స్‌కి ఈ యుద్ధ కళే మూలం. గెరిల్లా యుద్ధంలోనూ ఈ మార్షల్ ఆర్ట్‌నే ప్రధానంగా ఉపయోగించేవారట. ఈ యుద్ధ కళలోనే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ శిక్షణ తీసుకుంటోంది.
చందమామలా అందమే కాదు, అంతకు మించి..కాజల్ ప్రెగ్నెంట్ కాకముందే ఈ మార్షల్ ఆర్ట్‌లో ట్రైనింగ్ తీసుకుంది.గత మూడేళ్లుగా ఈ కళలో శిక్షణ తీసుకుంటున్న కాజల్, మధ్యలో ప్రెగ్నెన్సీ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కంటిన్యూ చేస్తోంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసమే, ఈ ప్రత్యేక మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంటోంది చందమామ.ఈ ఆర్ట్ నేర్చుకోవడం తనకు చాలా చాలా సంతోషాన్నిస్తోందని చెబుతూ, ఈ సందర్భంగా కాజల్ చేస్తున్న మార్షల్ ఆర్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. చాలా ప్రామిసింగ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది ఈ వీడియోలో కాజల్ అగర్వాల్. ఈ వీడియోలో కాజల్‌ని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.