Kajal Agarwal: పెళ్లి త‌ర్వాత ఫుల్ బిజీ.. కాజ‌ల్ ఖాతాలో మ‌రో బాలీవుడ్ చిత్రం

Kajal Agarwal: క‌లువ క‌ళ్ల‌సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ యువ హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అంద‌రితో న‌టిస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కాజ‌ల్‌కి తాజాగా మ‌రో బాలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. కార్తీ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్రచారం న‌డుస్తుంది.

Kajal Agarwal Full Busy After Marriage
Kajal Agarwal Full Busy After Marriage

మాతృక‌లో క‌థానాయిక పాత్రకు స్థానం లేదు. కాని హిందీ రీమేక్‌లో మాత్రం స్కోప్‌ని క‌ల్పించి అజ‌య్ దేవ‌గ‌ణ్ భార్య‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 2011లో రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హిందీ సింగం చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు రెండో సారి ఆయ‌న‌తో జ‌త‌క‌ట్టి మంచి వినోదాన్ని ప్రేక్ష‌కుల‌కి అందించాల‌ని భావిస్తుంద‌ట కాజ‌ల్‌. ఈ అమ్మ‌డు తెలుగులో ఆచార్య అనే సినిమాతో పాటు నాగార్జున చిత్రంలోను న‌టిస్తుంది.

35 ఏళ్ల వ‌య‌స్సులోను కాజ‌ల్‌కి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. అయితే పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ సినిమాలు చేయ‌ద‌ని అంద‌కు అనుకున్నారు. కాని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కాజ‌ల్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నా భర్త గౌతమ్‌ కిచ్లూ యాక్టింగ్‌ వదిలేయమని చెప్తే సినిమాల నుంచి తప్పుకుంటానని వెల్లడించింది. కానీ తన భర్త, కుటుంబం నుంచి కావాల్సినంత మద్దతు ఉందని, దానివల్లే ఇప్పటికీ నటన మీద దృష్టి పెట్టగలుగుతున్నాను అని చెప్పింది. ఆమె మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే కాజ‌ల్ సినిమా భ‌విష్య‌త్ ఆయ‌న భ‌ర్త చేతిలో ఉందేమో అనిపిస్తుంది.