Kajal : కాజల్ అగర్వాల్ వారికి బుద్ది చెప్తానంటోంది
NQ Staff - May 18, 2023 / 05:26 PM IST

Kajal : సినిమా స్టార్స్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం పని చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంకి ఎవరు కూడా మినహాయింపు కాదు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. కాజల్ అగర్వాల్ కూడా పలు సార్లు విమర్శలు ఎదుర్కొందట.
తాజాగా కాజల్ అగర్వాల్ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తీవ్రంగా విమర్శించిన వారు ఉన్నారు. ఆ సమయంలో నేను లావు అవ్వడంతో చాలా నీచంగా బాడీ షేమింగ్ చేశారని కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది.
కాజల్ అగర్వాల్ యొక్క అమ్మతనాన్ని కూడా నీచంగా అవమానించిన వారు ఉన్నారు. అమ్మ అయిన కాజల్ అగర్వాల్ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎందుకు ఇలా సినిమాలు చేయాలంటూ ఆమెను తీవ్రంగా విమర్శించిన వారు ఉన్నారు.
ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఆ విమర్శలకు సమాధానం ఇచ్చింది. తన బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వకుండా నేను సినిమాలు చేస్తున్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారు. నా బిడ్డకు ఒక అద్భుతమైన జీవితాన్ని.. భవిష్యత్తును ఇచ్చి ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారికి సమాధానం ఇస్తాను అన్నట్లుగా కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలు చేసింది.