Kaikala Satyanarayana : కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యం ఎలా ఉంది.. హెల్త్ బులిటెన్‌లో ఏం చెప్పారు..!

Kaikala Satyanarayana : సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై.. శనివారం అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఆదివారం కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ ద్వారా స్పందించారు. కైకాలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు.

Kaikala Satyanarayana health updates
Kaikala Satyanarayana health updates

‘‘ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా అని అన్నారు.

‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్లుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పార’’ని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి హెల్త్ బులిటెన్ విడుద‌ల చేయ‌గా, అందులో కైకాల స్పృహలోనే ఉన్నారని, అయితే, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

బీపీ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Kaikala Satyanarayana health updates
Kaikala Satyanarayana health updates