Kaikala Satyanarayana : కైకాల మ‌ర‌ణించిన‌ట్టు ప్రచారం.. పుకార్లు న‌మ్మోద్దంటున్న కూతురు

Kaikala Satyanarayana : ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్షకుల‌ని అల‌రించిన ఆయ‌న.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు.

TheNewsQube-
Kaikala Satyanarayana health update
Kaikala Satyanarayana health update

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో కూతురు ర‌మాదేవి స్పందించారు.

ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన కుమార్తె రమాదేవి తెలిపారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.

‘‘నాన్నగారు క్రమంగా కోలుకుంటున్నారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కైకాల ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’’ అని రమాదేవి పేర్కొన్నారు.

ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉంచి ఆయ‌న‌కు చికిత్స అందిస్తూ వ‌స్తున్న వైద్యులు నిరంత‌రం ఆయ‌న ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆదివారం ఆయ‌న స్పృహ‌లోకి వ‌చ్చిన‌ట్లు, తాను స్వ‌యంగా ఫోన్‌లో ఆయ‌నను ప‌రామ‌ర్శించిన‌ట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హాస్పిట‌ల్ వెలువ‌రించిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్ర‌కారం స‌త్య‌నారాయ‌ణ‌ క్ర‌మంగా కోలుకుంటున్నారు.