kaikala satyanarayana: కైకాల ఆరోగ్యంపై ఆందోళ‌న‌.. అపోలోలో అత్య‌వ‌స‌ర చికిత్స‌..!

kaikala satyanarayana: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక పేజి లిఖించుకున్న న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ‌. ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఇంట్లో కాలుజారి ప‌డ్డారు. దాంతో ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు.

kaikala satyanarayana health serious.lpg
kaikala satyanarayana health serious.lpg

ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న్ని అపోలో ఆసుప‌త్రిలో చేర్చారు. ఆయ‌న ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న కరంగా ఉంద‌ని స‌మాచారం అందుతోంది. 1935 జులై 25న కౌత‌వ‌రంలో జ‌న్మించిన కైకాల‌.. 1959తో సిపాయి కూతురు అనే సినిమాతో చ‌ల‌న చిత్ర రంగ ప్ర‌వేశం చేశారు. దాదాపు 777 చిత్రాల్లో న‌టించారు.

న‌వ‌ర‌స న‌ట‌నా సార్వ‌భౌమ గా కైకాల‌ని అభిమానులు, చిత్ర‌సీమ పిలుచుకుంటుంది. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో గా నటించిన కైకాల సత్యనారాయణ కాలక్రమంలో నేటి తరానికి తండ్రి, తాత పాత్రల్లో కూడా నటించారు. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తే.. అందులో ఒక పాత్రలో సత్యనారాయణ నటించేవారు.

ఎన్టీఆర్ కు కైకాల సత్యానారాయణ కు మంచి అనుబంధం ఉండేదని పలు మార్లు సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

kaikala satyanarayana health serious2
kaikala satyanarayana health serious2

కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు త‌న‌ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విష‌యం తెలిసిందే.