Kaikala Satyanarayana : మ‌రింత విష‌మంగా కైకాల ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుద‌ల‌

Kaikala Satyanarayana : సీనియ‌ర్ కైకాల ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కొన్ని రోజుల ముందు ఆయ‌న ఇంట్లో జారిప‌డి హాస్పిట‌ల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డింద‌ని అనుకున్న స‌మయంలో ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. అయితే ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని అంటున్నారు.

kaikala satyanarayana health news
kaikala satyanarayana health news

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ హెల్త్ కండీషన్ పై డాక్టర్స్ మీడియా బులెటిన్ విడుదల చేయగా, ఆందోళన కలిగిస్తుంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు. ఐసీయూలో రెస్పిరేటరీ సిస్టమ్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలం చెందినట్లు వెల్లడించిన వైద్యులు, కాపాడడం కూడా చాలా కష్టం అన్నట్లు ధృవీకరించారు. నేడు ఉదయం కైకాల సత్యనారాయణ జ్వరం, నీరసంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించారు.

వైద్యుల బృందం ఆయనను కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం పై మాత్రం నమ్మకం లేదని తెలియజేస్తున్నారు. కళామతల్లి ముద్దు బిడ్డగా ఆరు దశాబ్దాలు సేవలు అందించిన కైకాల సత్యనారాయణ కోలుకొని తిరిగి రావాలని, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

కైకాల‌ స‌త్య‌నారాయ‌ణ‌. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌తి నాయ‌కుడిగా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు.

అలాగే హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు స‌త్య‌నారాయ‌ణ‌. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు స‌త్య‌నారాయ‌ణ‌. 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు.