kaikala satyanarayana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

kaikala satyanarayana: ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యానికి గురై హాస్పిటలం లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు ట్రీట్ మెంట్ సాగుతుందని అన్నారు. ఇక గత కొన్ని రోజులుగా కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ వెంటిలేటర్ మీ సాగుతుందని అన్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు.

kaikala satyanarayana health is stable1
kaikala satyanarayana health is stable1

ఈ క్రమంలో సినీ ప్రముఖులు, అభిమానులు సత్యనారాయణ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి ఆయన ట్విట్టర్ ఖాతాలో కైకాల సత్యనారాయణ గురించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయన్ను ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సాయంతో ఆయన్ను ఫోన్లు పలికరించాను. ఆయన త్వరగా కోలుకుంటారని పూర్తి నమ్మకం కలిగింది.

kaikala satyanarayana health is stable2
kaikala satyanarayana health is stable2

ట్రాకియాస్టోమి కారణంతో ఆయన మాట్లాడలేకపోయినా, మళ్ళీ ఆయన ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలెబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి, థాంక్యూ అని చూపించినట్లుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కోన్నారు.