కన్నడ స్టార్ హీరో సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ హీరో తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచతం. ఈగ చిత్రంలో విలన్‌గా నటించి అలరించిన సుదీప్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలు చేశారు. కన్నడలో సుదీప్ కోటిగొబ్బ 3 అనే చిత్రాన్ని చేశాడు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో అత్యధిక బడ్జెట్ తో ప్రొడ్యూసర్ ఎంబీ బాబు నిర్మించగా ఇందులో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా నటంచింది . శ్రద్దా దాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సుదీప్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కోటిగబ్బ 3 చిత్రాన్ని తెలుగులో ”K3 కోటికొక్కడు” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. స్పందన పాసం – శ్వేతన్ రెడ్డి సమర్పణలో దేవేందర్ డీకే మరియు గుడ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో సుదీప్ సిగరెట్ తాగుతూ స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం సమకూర్చగా.. శేఖర్ చంద్రు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో కన్నడ – తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.