Baahubali:నీటిలో మునిగిపోకుండా శివ‌గామి కాపాడిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!

ప్ర‌భాస్, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప‌లు అవార్డులు ద‌క్కాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. అంతే కాదు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని ఎల్ల‌లు దాటించేలా చేసింది బాహుబ‌లి చిత్రం. రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిన బాహుబ‌లి చిత్రం ప్రేక్ష‌కుల‌కు క‌నుల‌పండుగ‌గా నిలిచింది. కేవ‌లం మ‌నదేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ చిత్రానికి నీరాజ‌నాలు ప‌లికారు. సినిమాలోని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పాత్ర‌లను తెగ ప్రేమించేశారు.

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి భారత దేశ సినిమా చరిత్రలో 1000 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డ్‌ను బీట్ చేసేందుకు బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు ప‌లు ఇండ‌స్ట్రీల‌కు సంబంధించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. బాహుబ‌లి సినిమాలో ప్ర‌తి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ‘చిన్నారి’ ప్రభాస్ ను కాపాడుకునేందుకు ‘శివగామి’ పాత్రలోని రమ్యకృష్ణ నీటిలో మునిగిపోతూ బిడ్డను మాత్రం చేతిలో పైకి పట్టుకుంటుంది. ఈ సీన్ మూవీకి ఆయువుప‌ట్టుగా నిలిచింది.

త‌న ప్రాణాలు కోల్పోతున్నా కూడా మాహిష్మ‌తి సామ్రాజ్యానికి చెందిన వార‌సుడిని కాపాడాల‌ని భావించి తాను చ‌నిపోయి చిన్నారిని ర‌క్షించింది . ఈ సీన్ చిత్ర క‌థ‌కు మూలం కాగా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే ర‌మ్య‌కృష్ణ చేతిలో ప‌ట్టుకున్న అమ్మాయి కాగా, ఆమె ప్ర‌భాస్ బంధువుల కూతురు అని, అచ్చం ప్ర‌భాస్‌ల ఉంద‌ని అప్ప‌ట్లో అనేక పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ పాప పేరు త‌న్వి కాగా, సినిమాలో న‌టించిన స‌మ‌యంలో నెల‌ల చిన్నారిగా ఉంది. ఇప్పుడు చాలానే పెద్ద‌గా అయింది. ప్ర‌స్తుతం త‌న్వి ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త‌న్వి చాలా చ‌లాకీ పిల్ల కాగా, త‌న మాట‌ల‌తో అంద‌రి హృద‌యాల‌ను దోచుకుంటుంది. బాహుబ‌లి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన త‌న్వి రానున్న రోజుల‌లో మ‌రి కొన్ని సినిమాల‌లో బాల న‌టిగా న‌టించాల‌ని అనుకుంటుంద‌ట‌.

Advertisement