NTR: స‌మంత సినిమాతో ఎన్టీఆర్ త‌న‌యుడు వెండితెర అరంగేట్రం..!

NTR: విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు న‌టుడిగా ఎంతటి కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న వార‌సులిగా ఎంద‌రో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. వీరిలో నంద‌మూరి బాల‌కృష్ణ కొంత ప‌ర్వాలేద‌నిపించ‌గా, జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా తాత ప‌రువు నిల‌బెట్టాడు. మిగ‌తా వారు పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నారు. అయితే ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ వార‌సుడు కూడా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

NTR

జూనియ‌ర్ ఎన్టీఆర్.. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి అనే యువ‌తిని వివాహం చేసుకోగా వీరికి భార్గ‌వ్ రామ్, అభ‌య్ రామ్ అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు.వీరిని ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంచుతారు ఎన్టీఆర్. అలా చేయ‌డానికి కార‌ణం ఏంట‌నే విష‌యాన్ని ఇటీవ‌ల ఆయ‌న పీఆర్వో తెలియ‌జేశారు. ఎన్టీఆర్ ఎఫెక్ట్ ఆయ‌న పిల్ల‌ల‌పై ప‌డ‌కూడ‌ద‌ని ఎక్కువ‌గా వారి ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌ర‌ని అన్నారు. మరి ఇప్పుడు న‌టుడిగా ప‌రిచ‌యం చేస్తారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

NTR

స‌మంత‌, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లలో గుణ శేఖ‌ర్ శాకుంత‌లం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శ‌కుంత‌ల- దుష్యంతుడు ప్రేమ ఆధారంగా రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో పీరియాడిక‌ల్ మూవీగా రూపొంద‌నున్న ఈ చిత్రంకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. విదేశీ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది ‘శాకుంతలం’. 1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది. ఈ సినిమాతో త‌ప్ప‌క హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నారు గుణ‌శేఖ‌ర్.

భారీ క్యాస్టింగ్‌తో శాకుంత‌లం సినిమాను గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తుండ‌గా, శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం స్టార్‌ హీరోల కొడుకులను సంప్రదిస్తున్నారట. జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఎవరో ఒకరిని శాకుంతలం సినిమాకు ఎంపిక చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట గుణ‌శేఖ‌ర్. భార్గ‌వ్ రామ్ న‌టించ‌ని ప‌క్షంలో అభ‌య్ రామ్‌ని అయిన త‌న సినిమాలో న‌టింప‌జేయాల‌ని గుణ‌శేఖ‌ర్ భావిస్తున్నాడ‌ట‌.

NTR

మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.శాకుంతలం చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.