Junior NTR : తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా ఎన్టీఆర్ కన్నీళ్లు.. వీడియో వైరల్
NQ Staff - March 2, 2023 / 05:08 PM IST

Junior NTR : నందమూరి తారకరత్న గత నెలలో కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని కొద్ది దూరం నడిచి గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన తారకరత్న తుది శ్వాస విడిచారు.
తారకరత్న తిరిగి కోలుకుంటారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురయింది. తారకరత్న మృతి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి ఫ్యామిలీకి మరియు అభిమానులకు తీవ్ర మనోవేదనకు గురి చేసింది. నేడు హైదరాబాదులో తారకరత్న పెద్ద కర్మ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ మరియు వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి నిర్వహించారు. తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ మరియు ఇతర కుటుంబ పెద్దలు హాజరయ్యారు.
తారకరత్న చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎన్టీఆర్ కంట కన్నీళ్లు కనిపించాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. తారకరత్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ చాలా సహాయం చేశాడు అనేది బయట టాక్. తారకరత్నతో బయటికి కనిపించకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.