Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడలేక తప్పుకున్న చిరంజీవి.. భయపడిపోయాడా..?
NQ Staff - March 5, 2023 / 04:20 PM IST

Junior NTR : ఇండస్ట్రీలో చిరంజీవికి ఎత్తు పల్లాలు కొత్తేం కాదు. ఆయన కింది స్థాయి నుంచి మెగాస్టార్ దాకా ఎదిగాడు. అయితే సినిమాల మీద చిరంజీవికి ఎంతో కమిట్ మెంట్ ఉంటుంది. ఆయన సినిమా ఎలా తీస్తే జనాలు చూస్తారనే విషయాలను బాగా తెలుసుకున్నాడు. అందుకే చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అంటుంటారు.
అంతే కాకుండా చిరంజీవి సినిమా వస్తుందంటే పెద్ద పెద్ద హీరోలు కూడా తప్పుకుంటారు. కానీ ఒకానొక సమయంలో చిరంజీవి కూడా ఓ యంగ్ హీరో సినిమాకు భయపడి వెనక్కు తగ్గారు. 2002లో డైరెక్టర్ బి.గోపాల్ ఒకేసారి రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర మూవీ తీశాడు.
వరుస ప్లాపులతో చిరు..
ఇంకో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అల్లరి రాముడు సినిమాను తీశాడు. అయితే ఈ రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. అప్పటికే తారక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో జోష్ లో ఉన్నాడు. కానీ చిరంజీవి మాత్రం వరుసగా శ్రీ మంజునాథ, మృగరాజు, డాడీ లాంటి ప్లాపులతో సతమతం అవుతున్నాడు.
ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మూవీ హిట్ అయి తన మూవీ ప్లాప్ అయితే తన కొడుకు వయసున్న హీరో ముందు తన పరువు పోతుందని భావించిన చిరంజీవి తన మూవీని వారం రోజులు వాయిదా వేయించారు. కానీ అనూహ్యంగా అల్లరి రాముడు ప్లాప్ అయింది. ఇంద్ర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో చిరు ఇమేజ్ మళ్లీ పెరిగింది.