NTR: సీక్రెట్‌గా శుభ‌కార్యం జ‌రిపించిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్

NTR ఈ మధ్య ఎక్కడ చూసినా కరోనా వార్తలు తప్ప మరొకటి రావడం లేదు. చూద్దామంటే ఒక గుడ్ న్యూస్ కూడా వినబడటం లేదు. ఇలాంటి సమయంలో అభిమానులకు ఒక తీపి కబురు చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన కూడా కొన్ని రోజుల కిందట కోవిడ్ బారిన పడ్డాడు. అయితే సరిగ్గా రెండు వారాల తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. దాంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇదిలా ఉంటే మే నెలలో ఎన్టీఆర్ గుర్తిండిపోయే పనులు చాలానే చేశాడు. మే 5న ఈయన తన పదవ పెళ్లి రోజు జరుపుకున్నాడు. ఆ వేడుకల్లోనే ఈయనకు కరోనా సోకి ఉంటుందని అనుమానాలు వెలువడ్డాయి.

Jr NTR Sons

ఇదిలా ఉంటే వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈయన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఎవరికీ చెప్పకుండా చాలా గోప్యంగా దీన్ని పూర్తి చేశాడు యంగ్ టైగర్. ఆయన చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో మే 30న అక్షరాభ్యాసం పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఆహ్వానించడానికి లేదు. వేడుకలు కూడా చేసుకోకూడదు. అందుకే ఎవరిని పిలవకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ తతంగం పూర్తి చేశారు. ఇది తెలిసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2018 లో భార్గవ్ రామ్ జన్మించాడు.

Jr NTR Family

ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బుడ్డోడి అక్షరాభ్యాసం కూడా పూర్తి అయిపోయింది. జూనియర్ కు మరో కొడుకు కూడా ఉన్నాడు. ఆయన పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్. 2014లో ఈ కుర్రాడు జన్మించాడు. జూన్ 14 తో భార్గవ్ రామ్ నాలుగవ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ఆలోపు అక్షరాభ్యాసం పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఒక పండితుడితో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా ఈ వైరస్ సమయంలో కాస్తోకూస్తో ఒక గుడ్ న్యూస్ చెప్పాడు తారక్. దాంతోనే నందమూరి అభిమానులు సంతృప్తి పడుతున్నారు.