Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎంత జోవియల్ గా ఉంటాడో అంత సెంటిమెంటల్ ఫెలో. ఎంత యంగ్ టైగరో అంత ఎమోషనల్ పర్సన్. పోలికలు, డైలాగ్ డెలివరీలోనే కాదు.. స్పీచ్ లు ఇవ్వటంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తుకు తెచ్చే రియల్ హీరో. ఇవాళ ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఒక మూవీ ప్రిరిలీజ్ వేడుకలో భావోద్వేగంతో ప్రసంగించాడు. ఆ సినిమా పేరు ‘‘తెల్లవారితే గురువారం’. ఇందులో హీరో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు. పేరు శ్రీసింహ. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్టుగా పాల్గొన్న తారక్ మాట్లాడుతూ తనకు గడచిన రెండు దశాబ్దాలుగా దేవుడిచ్చిన గొప్ప బలం అభిమానులైతే దేవుడిచ్చిన మంచి కుటుంబం జక్కన్న కుటుంబమని చెప్పాడు. ఈ ఫ్యామిలీ నిర్వహించే ఏ ఫంక్షన్ కైనా తాను అతిథిగా రానని, ఆ కుటుంబ సభ్యుడిగానే మనస్ఫూర్తిగా హాజరవుతానని తెలిపాడు. తన జీవితంలో తీసుకునే ఎన్నో నిర్ణయాల వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగా కీరవాణి ఫ్యామిలీ ప్రమేయం ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ వివరించాడు.

Jr NTR : tarak emotional speech in a movie prerelease function
Jr NTR : tarak emotional speech in a movie prerelease function

27న విడుదల: Jr NTR

ఈ పిక్చర్ ఈ నెల 27న అంటే వచ్చే శనివారం విడుదలవుతోంది. దీనికి డైరెక్టర్ మణికాంత్ జెల్లి. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ (కీరవాణి పెద్ద కొడుకు). ఈ చిత్రానికి పనిచేసిన ప్రతిఒక్కరికీ అద్భుతమైన విజయం అందించాలని యంగ్ టైగర్ సినీ ప్రేక్షకులను కోరాడు. సక్సెస్ మీట్ లో మరోసారి కలుద్దామని ఆకాంక్ష వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తమ కుటుంబం ఇన్నాళ్లూ శ్రీసింహ గురించే ఆలోచించేదని, హీరోగా ఎలా చేస్తాడా అని భయపడేవాళ్లమని, ఇప్పుడు ఆ భయాన్ని ప్రేక్షకులు పోగొట్టబోతున్నారని అన్నారు. దర్శకుడిగా ఫస్ట్ మూవీ అయినప్పటికీ మణికాంత్ చాలా చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడని కితాబిచ్చారు. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయని చెప్పారు. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జి ముప్పనేని నిర్మిస్తున్నారు.

Advertisement