JR NTR: శ్రీమ‌తి బ‌ర్త్‌డేను స‌ర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేసిన ఎన్టీఆర్.. నువ్వు సూప‌ర్ అన్న అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇటు పర్స‌న‌ల్ అటు ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ జీవితం గ‌డుపుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా కాస్త త‌గ్గిన త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి ఎన్టీఆర్ దుబాయ్‌కు వెళ్ల‌గా ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం,ప్ర‌శాంత నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు బుల్లితెర షో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే కార్య‌క్రమంతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రొషెష‌న‌ల్ విష‌యాలు ప‌క్క‌న పెడితే త‌న ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాల‌ను మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచుతుంటారు. ఏ విష‌యాలు కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు ఎక్స్‌పోజ్ కానివ్వరు. మార్చి 18న త‌న శ్రీమ‌తి ల‌క్ష్మీ ప్ర‌ణీత బ‌ర్త్‌డే కాగా, ఆ రోజు ఫామ్ హౌజ్‌ను కానుక‌గా ఇచ్చిన ఎన్టీఆర్ అందులో భారీ పార్టీ ఏర్పాటు చేశాడ‌ట‌. ఈ ఫామ్ హౌజ్‌ హైదరాబాద్ లో ఖరీదైన ఏరియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది . లక్ష్మీ ప్రణతి రాకతో ఎన్టీఆర్ లైఫ్ ఆనంద‌దాయ‌కంగా మార‌గా, అభయ్ రామ్ – భార్గవ్ రామ్ అనే ఇద్దరు కిడ్స్ వ‌చ్చాక జూనియ‌ర్ జీవితం మ‌రింత ప్రకాశ‌వంతంగా మారింది.

Advertisement