JR NTR: కుమారుడి పెళ్లికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన వీరాభిమాని.. ప‌త్రిక‌ను స్వీక‌రించి ఫొటో దిగిన జూనియ‌ర్

సినిమా హీరోలకు అభిమానులు కొండంత బ‌లం అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారి వ‌ల్ల‌నే ఈ పొజిష‌న్‌లో ఉన్నాం అని వారు చాలా సంద‌ర్భాల‌లో చెప్పిన సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. అయితే అభిమానులు క‌ష్ట సుఖాల‌లో ఈ హీరోలు కూడా ఒక్కోసారి భాగం అవుతుంటారు. గ‌తంలో అభిమానులు ఆరోగ్య ప‌రిస్థితులు బాలేని స‌మ‌యంలో హీరోలు స్వ‌యంగా వారింటికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం లేదంటే ఫోన్‌లో వారితో మాట్లాడి ధైర్యం చెప్ప‌డం వంటివి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవ‌లి కాలంలో క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న అభిమానితో వీడియో కాల్‌లో మాట్లాడి అత‌నికి కొండంత ధైర్యాన్ని అందించాడు.

ఇక తాజాగా ఎన్టీఆర్ ఓ వీరాభిమాని ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికను స్వీకరించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ భాస్కర్ చౌదరి త్వ‌ర‌లో త‌న కొడుకు వివాహం చేయ‌నుండ‌గా,త‌న కుమారుడి వివాహానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు పెళ్లి కార్డు ప‌ట్టుకొని కుటుంబ స‌మేతంగా జూనియర్ ఇంటికి వెళ్లారు. క‌రోనా వ‌ల‌న అంద‌రు మాస్క్‌లు ధ‌రించి ఉన్నారు. ఎన్టీఆర్ ఖ‌రీదైన బ్లాక్ మాస్క్ ధ‌రించి ఉండ‌డం ఇందులో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నుండగా, ఆయ‌న పాత్ర‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు లుక్స్ విడుద‌ల‌య్యాయి. ఇవి ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కించ‌నున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం, ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు ఎన్టీఆర్.

Advertisement