Jr NTR : ఎన్టీఆర్‌ న్యూ లుక్.. భలే మారాడే

NQ Staff - April 12, 2023 / 07:50 PM IST

Jr NTR : ఎన్టీఆర్‌ న్యూ లుక్.. భలే మారాడే

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌ చిత్రం కోసం కాస్త బరువు పెరిగిన విషయం తెలిసిందే. కొమరం భీమ్ పాత్ర కోసం బరువు పెరగాలంటూ రాజమౌళి కోరడం.. ఎన్టీఆర్ ఓకే చెప్పడం జరిగి పోయింది. సినిమా పూర్తయింది.. విడుదలైంది. అయినా కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ బరువు తగ్గక పోవడం పట్ల కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

ఇంకా ఎప్పుడు ఎన్టీఆర్ బరువు తగ్గుతాడు.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిపోతున్న సినిమా కోసం కూడా ఎన్టీఆర్ ఇలాగే కనిపిస్తాడా అంటూ అభిమానులు కొందరు మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Jr NTR Looking Stylish In Photos Taken At Shooting Spot

Jr NTR Looking Stylish In Photos Taken At Shooting Spot

తాజాగా ఒక అభిమానితో ఎన్టీఆర్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ చూసి అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు. షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా ఉన్నాడంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

తక్కువ సమయంలోనే భలేగా మారాడే అంటూ ఎన్టీఆర్ గురించి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నెల చివర్లో రెండవ షెడ్యూల్‌ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us